![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -367 లో.. సంక్రాతి పండుగ సందర్భంగా ఇంట్లో అందరు కలిసి అరిటాకులో భోజనం చేస్తుంటారు. అందరికి భవాని భోజనం వడ్డీస్తు ఉంటుంది. ఆ తర్వాత భవాని కూర్చొని భోజనం చేస్తే కృష్ణ వడ్డీస్తుంది. వంటలన్ని బాగున్నాయంటూ మధు, గౌతమ్ కలిసి కృష్ణని పొగుడుతుంటారు. వంటలు చేసింది నేను కాదు ముకుంద అని కృష్ణ చెప్తుంది. దాంతో ముకుంద నీకు ఈ టాలెంట్ కూడా ఉందా అని మధు అంటాడు.
కాసేపటికి మధు, గౌతమ్ ఇద్దరు మాట్లాడుతూ.. ఎవరికి ఎంత బలం ఉందోనంటు ఇద్దరు చేతులు పట్టుకొని గేమ్ ఆడుతారు. అప్పుడే భవాని రావడంతో బయపడి గేమ్ ఆపేస్తారు. ఇక భవాని అందరికి బట్టలు తీసుకొని వస్తుంది. అందరికి బట్టలిచ్చిన భవాని.. ముకుందకి ఇవ్వదు. ముకుంద బాధపడుతుందేమోనని ఇవ్వండి అత్తయ్య అని కృష్ణ అంటుంది. కాసేపటికి నేను ఇస్తానంటు మిగిలిన ఒక కవర్ ని కృష్ణ ముకుందకి ఇస్తుంది. ఆ తర్వాత మురారి కృష్ణ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే కృష్ణ మురారీకీ కాఫీ తీసుకొని వస్తుంది.. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మధు రెడీ అవుతు తనని తాను అద్దంలో చూస్తూ పొగుడుకుంటాడు. పక్కరూమ్ లో నందు అందంగా రెడీ అవుతుంది. దాంతో గౌతమ్ వచ్చి చాలా బాగున్నావంటు పొగుడుతాడు.
ఆ తర్వాత మురారి పంచె కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే కృష్ణ వస్తుంది. ఈ పంచే ఎవరు కనిపెట్టారో కానీ అంటు మురారి చిరాకు పడుతుంటాడు. పంచె అంటే తెలుగు సంసృతి అంటూ కృష్ణ గొప్పగా చెప్తుంది. కాసేపటికి మురారికి కృష్ణే పంచె కడుతుంది. ఆ తర్వాత అందరు పూజకి రెడీ అయి కిందకి వస్తారు. అలా వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత సుమలత పూజకి కావాల్సిన పండ్లు తీసుకొని వస్తుంటే కింద పడిపోబోతు.. ఫ్రూట్స్ కిందపడేస్తుంది. చూసుకోవాలి కాదా అంటూ భవాని కోప్పడతుంది. ఆ తర్వాత కృష్ణ మురారి కలిసి పూజ చేస్తారు. తరువాయి భాగంలో సినిమాకి ముందు టీజర్ విడుదల చేసినట్లుగా ఫస్ట్ నైట్ కి ముందు టీజర్ విడుదల చేద్దామా అని మురారి అంటుంటే.. కృష్ణ సిగ్గు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |